హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

ప్రకాశం: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలువురు మండలాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. 198 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, సర్పంచ్ స్థానాలకు 464, వార్డు స్థానాలకు 1,475 మంది నామినేషన్లు వేశారు. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు మొత్తం 624, వార్డులకు 1,652 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.