హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుడా ఛైర్మన్‌ను కలిసిన తిరుపతి రూరల్ ఎంపీపీ

TPT: చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ ఎంపీపీగా నూతనంగా ఎన్నికైన కత్తి కళ్యాణి, తన భర్త కత్తి సుధాతో కలిసి తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి దంపతులను అభినందించి, మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.