హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ పోరులో పక్కింటి వారే ప్రత్యర్థులు!

NTR: జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామపంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ, కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులిద్దరూ యాదవ సామాజికవర్గానికి చెందినవారు. అంతేకాకుండా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఒకే సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరిలో గ్రామస్థులు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది.