VZM: బొబ్బిలి DSP రాకోటి గోవిందరావు గురువారం ఆరికతోటలో రాజకీయ నేతలు, గ్రామ పెద్దలు, పోటీదారులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలన్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలకు తావులేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేతలు, పోటీదారులతో డీఎస్పీ సమావేశం


