హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బిర్యాని ఇప్పిస్తానని.. యువతిపై అత్యాచారం'

గుంటూరు జిల్లా తెనాలిలో 18 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. స్థానిక రైతుబజారులో పనిచేస్తున్న యువతిని ఈ నెల 13న బిర్యాని, చెప్పులు కొనిస్తానని నమ్మించి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో తెనాలి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.