AKP: రోలుగుంట మండలం బుచ్చెంపేట మినీ కైలాసగిరి ఆలయంలో కార్తీక ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
ఆంధ్రప్రదేశ్
మినీ కైలాసగిరిలో ఘనంగా కార్తీక ఏకాదశి పూజలు


