SKLM: జిల్లాలో ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకం జారీ అయినవారికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైనవారు నేడు సాయంత్రంలోగా ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించాలి.
ఆంధ్రప్రదేశ్
ఓపీఎస్ దరఖాస్తులకు నేడే లాస్ట్!


