హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం

WG: ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు మరో అవకాశం కల్పించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి.రవీందర్ తెలిపారు. డిసెంబర్ 23, 2026 - ఫిబ్రవరి 2, 2027 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి 2,690, కృష్ణా-గుంటూరు నుంచి 717 దరఖాస్తులు అందాయన్నారు. అర్హులు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.