హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: బ్యాంకులవీధి ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ బి.కె.నాయుడు తెలిపారు. బాలభాను పాఠశాల రోడ్డు, వర్మ కాంప్లెక్సు, మురళీనగర్, స్కేటింగ్ పార్కు, వాకర్స్ పార్కు, తెన్నేటినగర్, వివేకానంద వీధి ప్రాంతాలకు ఈ కోతలు వర్తిస్తాయన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.