VSP: సెక్టార్-6లో కొలువైన వేంకటేశ్వర స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఇవాళ కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా దీపోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని, దీపోత్సవంలో పాల్గొని పుణ్యఫలం పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దీపోత్సవ కార్యక్రమం


