హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠం కోసం 15మంది పోటీ

బాపట్ల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి జరగనున్న ఎన్నికల్లో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల అధికారులు తుది జాబితాను విడుదల చేశారు. బీజేపీ నుంచి ఇస్క సునీల్ కుమార్, వైసీపీ నుంచి సుధీర్ బాబు కాగిత, కాంగ్రెస్ నుంచి చింత విస్లీ ప్రేమ కుమార్, బీఎస్పీ నుంచి జంగం దాసు, సీపీఐ నుంచి దాసి నాగేశ్వర రావు, 10 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.