హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనగణన-2027పై కలెక్టర్ కీలక సూచనలు

KDP: జనగణన-2027లో ఖచ్చితమైన సమాచారం సేకరణ ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించవచ్చని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని డిజిటల్ విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వ్యక్తిగత సమాచార గోప్యత కాపాడాలని, బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.