AKP: తుఫాన్ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుండటంతో అనకాపల్లికి పెను ముప్పు తప్పిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మరో 48 గంటలు కంట్రోల్ రూమ్లు కొనసాగుతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అనకాపల్లికి తప్పిన పెను తుఫాన్ ముప్పు'


