అనకాపల్లి పరిధిలో కొత్తూరు పంచాయతీ సుబ్రహ్మణ్యం కాలనీలో ఎస్సై భాస్కర రావు ఆధ్వర్యంలో 'పల్లె నిద్ర' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో సమావేశమై పంచాయతీ ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని, సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దని సూచించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె నిద్రలో ఎన్నికల నియమావళిపై SI అవగాహన


