హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే అనకాపల్లి జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక

అనకాపల్లి పరిషత్ కార్యాలయంలో నేడు జరిగే జెడ్పీ ఛైర్మన్ ఎన్నికకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నరసింహారావు తెలిపారు. కార్యాలయ పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, జనం గుమిగూడవద్దని హెచ్చరించారు. కేవలం ఓటు హక్కున్న సభ్యులకే లోపలికి అనుమతి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో, అధికారులకు జీవీఎంసీ ఆవరణలో పార్కింగ్ కేటాయించారు.