హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

ATP: బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తాండా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. యలగలవంకకు చెందిన మాలక్కను ఆమె మరిది గొల్ల గోవిందు రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు విచారణలో తేలింది. కుటుంబ కలహాలు, డబ్బుల వివాదమే కారణమని గుర్తించారు. ఈనెల 18న జరిగిన ఘటనలో నిందితుడిని ఉరవకొండ రూరల్ సీఐ ఈరన్న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.