హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సై అప్రమత్తతతో తప్పిన అగ్ని ప్రమాదం

ASR: జీకేవీధి మండలం సీలేరు గ్యాస్ గోడౌన్ సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద గురువారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ వెంటనే స్పందించి, సీఆర్‌పీఎఫ్ బలగాల సహాయంతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను అగ్ని ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.