SKLM: జిల్లాలో నవోదయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 28న జరగనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. 12 మండలాల్లో 29 కేంద్రాల్లో 7,243 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, పరీక్ష సమయంలో నెట్, జెరాక్స్ కేంద్రాలు మూసివేయాలని, నిరంతర విద్యుత్ ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష!


