హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి బాబా జయంతికి అదనపు హాల్ట్

SS: పుట్టపర్తిలో నవంబర్ 23న జరిగే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్ 18 నుంచి 29 వరకు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో మొత్తం 26 రైళ్లకు తాత్కాలికంగా అదనపు హాల్ట్ కల్పించింది. పెనుకొండ–ప్రశాంతి నిలయం–ధర్మవరం మార్గంలో కొన్ని రైళ్లను తాత్కాలికంగా మళ్లించనుంది.