దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించిన ముంబై భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ప్రమాదకరంగా మారిన 87 ఏళ్ల నాటి ఈ భవనాన్ని బీఎంసీ అధికారులు కూల్చడం ప్రారంభించారు. అయితే ఇది వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. కూల్చివేత సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. దీంతో ఈనెల 25 వరకు కూల్చివేతను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
దావూద్ ఇంటి కూల్చివేతకు హైకోర్టు బ్రేక్


