హైదరాబాద్: 28°C
వార్తలు

కోదాడలో విశ్వశాంతి మహాయాగం

SRPT: కోదాడ పట్టణంలో వంటిపులి గోపయ్య మైదానంలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శుక్రవారం నుంచి డిసెంబర్ 6 వరకు 17 రోజులు జరగనుంది. శ్రీకృష్ణ పీఠం అధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి గురువారం యాగశాల వద్ద విలేకరులకు వివరాలు తెలిపారు. అతిరుద్రం, ఆయుత చండీ, కోటి కుంకుమార్చన, కోటి దీపోత్సవం వంటి క్రతువులు, భక్తులకు అన్నప్రసాదం ఉంటాయి. భక్తులు తరలిరావాలని కోరారు.