హైదరాబాద్: 28°C
వార్తలు

AP, తెలంగాణలకు KRMB లేఖ

కృష్ణా నదిపై అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణంపై కృష్ణా రివర్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు AP, TGలకు KRMB లేఖ రాసింది. అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మిస్తే నీళ్లపై అధికారాలు రావని.. ట్రిబ్యునల్ కేటాయింపులు లేకుండా నీటిపై హక్కులుండవని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలని పేర్కొంది. KRMB పరిధి అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిపింది.