తమిళనాడు చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.710 కోట్ల విలువైన 71.24 కేజీల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మత్తుపదార్థాలతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని శ్రీలంకకు తరలిస్తుండగా అడ్డుకుని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా పట్టుబడిన హెరాయిన్ నిల్వల్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
వార్తలు
రూ.710 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత


