హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలేష్‌పై విరుచుకుపడిన యోగి

యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై సీఎం యోగి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి మాఫియా శక్తులతో ఎస్పీ అధినేత ఆధారపడుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో గూండాగిరి, అరాచకం, అల్లర్లు కొనసాగాయని గుర్తు చేశారు. ఒకవేళ అఖిలేష్ ప్రభుత్వం వస్తే మళ్లీ దౌర్జన్యాలు, మాఫియా ముఠాలు పేట్రేగిపోతారని చెప్పారు. గత పదేళ్లలో ఇలాంటి వారిని అంతం చేశామని తెలిపారు.