హైదరాబాద్: 28°C
వార్తలు

నృత్యంతో అదరగొట్టిన యువతీయువకులు

ATP: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురువారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. నాటకం, నృత్యం, చిత్రలేఖనం, కవిత్వ పఠనం, జానపద పాటలు తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల, ఏరా ఇంటర్నేషనల్ స్కూల్, RIPER కళాశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించారు. విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.