హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరుబావి అనుమతులు మీ సేవ ద్వారానే

HYD: రాష్ట్రంలో బోరుబావుల తవ్వకానికి అనుమతి దరఖాస్తులను ఇకపై మీ సేవ పోర్టల్ ద్వారానే స్వీకరించాలని భూగర్భ జల శాఖ డైరెక్టర్ లక్ష్మ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు తీసుకోరు. ప్రతి దరఖాస్తు పరిశీలనకు కనీసం 15 రోజులు పడుతుంది. తాగునీటి వనరులకు 250 మీటర్ల దూరం తప్పనిసరి. లాగిన్ సౌకర్యం ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.