హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర తేలిన రోడ్డుతో వాహనదారుల తీవ్ర ఆందోళన

ADB: గ్రామీణ మండలం లింగుగూడ పంచాయతీ పరిధిలోని దార్లొద్ది గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయని చోదకులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్సు గ్రామానికి రాలేని దుస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.