హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యూజియంలో కలాం విగ్రహం కోరిక

NRPT: కోస్గిలోని సైన్స్ మ్యూజియంలో మాజీ రాష్ట్రపతి, APJ అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని MIM మండల అధ్యక్షుడు అంజద్ ఖాన్ కోరారు. విలేకరులతో మాట్లాడుతూ, మ్యూజియంలో పలువురు శాస్త్రవేత్తల చిత్రపటాలు ఉన్నప్పటికీ కలాం చిత్రం లేకపోవడం బాధాకరమన్నారు. కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.