హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల పర్యవేక్షణ

WNP: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం పరీక్షల నియంత్రణ అధికారి డా. కె. ప్రవీణ షాద్‌నగర్‌లోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలను పరిశీలించి, పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.