హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కలెక్టర్

JN: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ సూచించారు. రెడ్ క్రాస్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. జనవరి 12 వరకు జిల్లాలో యువతకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ లవ కుమార్ రెడ్డి తెలిపారు.