హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికలకు కరాటే శిక్షణ.. ఆత్మరక్షణే లక్ష్యం

MHBD: బాలికల భద్రత, స్వీయరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాలోని 102 జడ్పీ పాఠశాలల్లో దశలవారీగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. వారంలో మూడు రోజులు శిక్షణ ఇస్తారు. దీని ద్వారా సుమారు 11 వేల మంది బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలతో పాటు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరగనున్నాయి.