హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

MDK: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పొడిగించినట్లు మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారు, మార్పులు కోరుకునే అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.