HYD: ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’లో పాల్గొనాల్సిందిగా సినీనటుడు నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి యాత్ర టీ-షర్టులను అందజేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత, ప్రజలను ఏకం చేసే ఈ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నాగార్జున తెలిపారు.
తెలంగాణ
VIDEO: ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు హీరో నాగార్జున మద్దతు


