జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లికి చెందిన రంగు కిరణ్ ట్రాక్టర్ నడుపుతూ తల్లిదండ్రులకు అండగా ఉండేవాడు. జనవరి 7న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ
కొడుకు కష్టంతో కన్నీటి పర్యంతం!


