హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు మంజూరైనా.. కాని పనులు

SDPT: పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరై ఆరు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు పాత భవనం శిథిలావస్థకు చేరి, పైకప్పు పెచ్చులూడుతుండటంతో ప్రమాదకరంగా మారింది. నిధులు మంజూరైనా నిర్మాణ పనులు చేపట్టకపోవడంపై పశుపోషకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.