హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: MLA

KMR: బాన్సువాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 621 మంది పేదలకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే 179 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 53.69 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.