హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరువు సహాయక చర్యలేవి: సీపీఎం

BKD: కరువు మండలాలను ప్రకటించినా ఇప్పటివరకు సహాయక చర్యలు చేపట్టలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య విమర్శించారు. గురువారం ములకలపల్లి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఎల్‌నినో, తుపానులతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బడ్జెట్ కేటాయించాలని, రుణాలు పరిష్కరించాలని, 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.