హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: మండల కేంద్రంలోని అంగడి బజారులో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు అవసరమైన సౌకర్యాలను పరిశీలించి, ధాన్యం విక్రయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.