కరీంనగర్ నగరంలో భవన నిర్మాణాలపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి అల్కాపురి, సదాశివపల్లి, కట్టరాంపూర్, మంకమ్మతోట ప్రాంతాల్లో పర్యటించి ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించారు. అనుమతుల ప్రకారం అదనపు నిర్మాణాలున్నాయా అని తనిఖీ చేశారు. నిబంధనలు పాటించిన భవనాలకే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.
తెలంగాణ
భవన నిర్మాణాలు తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్


