హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారం రోజుల్లో భువన్ సర్వే పూర్తి చేయాలి: కమిషనర్

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న భువన్ సర్వేను కమిషనర్ ఎం. గిరీష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 అంచనాలను మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.