హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజరూప దర్శనానికి సిద్ధమైన కొండగట్టు అంజన్న

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చందనోత్సవంలో భాగంగా మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని పూర్తిగా తొలగించారు. 60 ఏళ్లుగా పేరుకుపోయిన చందనాన్ని కొండగట్టు అనువంశిక అర్చకులు, స్థానాచార్యులు శాస్త్రోక్తంగా తొలగించి అంజన్న నిజరూప దర్శనానికి సిద్ధం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు, స్థానాచార్యులు కలిసి చిత్రాలు దిగారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.