హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి పొదుపుపై విద్యార్థుల ప్రతిజ్ఞ

ములుగులోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో జలసంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. నీటిని వృథాచేయకుండా పొదుపుగా వినియోగిస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ప్రిన్సిపాల్ ఎం.డి. ముజీబ్ సూచించారు.భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాలన్నారు.