హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ కోచ్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

BDK: కాచనపల్లిలోని గిరిజన సంక్షేమ బాలికల మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన కబడ్డీ కోచ్ పోస్టుకు అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు గురువారం ITDA PO రాహుల్ తెలిపారు. NIS డిప్లొమా లేదా PG డిప్లొమా ఉన్నవారు ఈనెల 23 నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు భద్రాచలం ITDA PMRC స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.