హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ నగర్ అర్బన్ పీహెచ్‌సీని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సినేషన్ గదులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, వ్యాధుల ముందస్తు గుర్తింపునకు ఎన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.