WGL: నల్లబెల్లి పంచాయతీలో 2022 నుంచి 2026 మార్చి వరకు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు. రూ.15,21,323 నగదు నిల్వ ఎక్కడ ఉందో, ప్రభుత్వ ఖాతాలో ఎందుకు జమ కాలేదో అధికారులు చెప్పాలన్నారు. ప్రత్యేక ఆడిట్ చేసి వాస్తవాలు ప్రజల ముందుంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పంచాయతీ నిధుల అక్రమాలపై విచారణ జరపాలి: బీజేపీ


