హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదోన్నతి పొందిన అధికారులకు ఘన సన్మానం

PDPL: రామగుండం సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులకు గని మేనేజర్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా గురువారం ఆర్జీ-3 ఓసీపీ-1లో ఐఎన్‌టీయూసీ నాయకులు, ఉద్యోగులు కలిసి వారిని పూలమాలలు, శాలువాలతో ఆత్మీయంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.