హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్‌ల కోసం చేనేతల నిరసన

BHNG: రాజాపేటలో అర్హత ఉన్నా పెన్షన్లు మంజూరు కాలేదంటూ రఘునాథపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపి, అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన చేనేత కార్మికులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.