హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుషుల దినోత్సవం.. మగవారి మౌన వేదన

SRCL: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో మగవారి సమస్యలపై చర్చ సాగింది. కుటుంబ బాధ్యతల కోసం పురుషులు తమ బాధలు, కోరికలను అణచుకుంటున్నారని, ఇంటి పనులు, పిల్లల చదువు చూస్తూనే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్ పనులు చేస్తున్నారని విశ్లేషించారు. ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అధికమని, అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.