హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించే ఉద్యోగులను తొలగించాలని, హాజరు సక్రమంగా నమోదు చేయని ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.