హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రబోరులో నకిలీ వైద్యుడిపై దాడి

BDK: చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్న షేక్ మస్తాన్ వలీ అనే అర్హత లేని వ్యక్తిపై టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగం బుధవారం దాడి చేసింది. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు సహా 34 రకాల మందులు రూ.42 వేల విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. నమూనాలు పరీక్షకు పంపి, డ్రగ్స్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అశ్వని తెలిపారు.